అక్కడకు వెళ్లాలని ఉంది : పవన్ కళ్యాణ్

మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలని, మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

By -  Medi Samrat
Published on : 13 Feb 2026 4:21 PM IST

అక్కడకు వెళ్లాలని ఉంది : పవన్ కళ్యాణ్

మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలని, మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారని, తనకు గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరిక ఉందన్నారు పవన్. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానన్నారు. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story