తెలంగాణ గడ్డ నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతా..

Pawan Kalyan Comments On Telangana. బలమైన మార్పు కోసం పోరాటం చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

By Medi Samrat
Published on : 9 Oct 2021 5:24 PM IST

తెలంగాణ గడ్డ నాకు ధైర్యాన్ని ఇచ్చింది.. దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతా..

బలమైన మార్పు కోసం పోరాటం చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు 2009లో తాను తిరిగానని తెలిపారు. ఓడిపోయినా పోరాటం చేస్తాన‌ని.. దెబ్బకొట్టే కొద్దీ మరింత ఎదుగుతాన‌ని ప‌వ‌న్ అన్నారు. రాజకీయ చదరంగంలో ఒక్క అడుగైనా ఆలోచనతో ముందుకు వెయ్యాలని.. తెలంగాణ గడ్డ నాకు ధైర్యాన్ని ఇచ్చిందని పవన్ క‌ళ్యాణ్ అన్నారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయాల్లో డబ్బుతో, పేరుతో పని లేదని.. బలమైన భావజాలం ఉంటే చాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్పుకోసం వచ్చిన పార్టీ జనసేన అని అన్న ఆయ‌న‌ తెలంగాణ గడ్డకు ఋణగ్రస్తున్ని అని అన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తినే నన్ను ఇవ్వాళ ఇక్కడి వరకు తెచ్చిందని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.


Next Story