బీఆర్ఎస్ నేత, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గాలి వినోద్ కుమార్ కూడా హస్తం గూటికి చేరారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వీరిద్దరు పార్టీ కండువా కప్పుకన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఇరువురు నేతలు.. తమ అనుచరులతో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి జెండా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్‌పై గూడెం మహిపాల్ రెడ్డి 7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే.. గత లోక్ సభ ఎన్నికల్లో గాలి వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్ సమీప బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై 46 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.