ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశం ప్రస్తుతం తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు నేరుగా ప్రభావం చూపే అంశాలు పార్లమెంట్‌లో చర్చకు రాకపోవడం విచారకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 12 Dec 2025 2:52 PM IST

ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశం ప్రస్తుతం తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు నేరుగా ప్రభావం చూపే అంశాలు పార్లమెంట్‌లో చర్చకు రాకపోవడం విచారకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ.. “DGCA కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన రెండు సంవత్సరాలు అవుతున్నా, ఇండిగో మాత్రం వాటిని నిర్లక్ష్యం చేసింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఈ అంశంపై చర్చ తప్పనిసరి” అన్నారు. అలాగే.. ఢిల్లీలో కాలుష్యం 500కి పైగా AQI చేరి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుండగా, దీనిపై కూడా ప్రభుత్వం మౌనం వహిస్తున్నదని విమర్శించారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ.. “రూపాయి విలువ పడిపోవడం ఆందోళనకరం. రూపాయి ICUలో ఉన్నట్టువుంది. నిరుద్యోగం పెరిగింది. మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఎక్కడ?” అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అసలు సమస్యలను పక్కన పెట్టి, 150 సంవత్సరాల క్రితం అంశాలపై చర్చ జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎంపీ అన్నారు.

రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం ఇవ్వకపోవ‌డాన్ని ఆయన విమర్శించారు. “ఎన్నికల కమిషనర్ ఎంపికలో ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారు? న్యాయవ్యవస్థపై గౌరవం ఎందుకు చూపడం లేదు?” అని ప్రశ్నించారు. “ఈ విషయాలను ప్రభుత్వం వ్యక్తిగతంగా కాకుండా దేశ ప్రయోజనంగా తీసుకొని చర్చకు రావాలి” అని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.

Next Story