బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడం ఖాయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. పార్టీ చిన్నాభిన్నమైన కూడా ఇంకా సిగ్గు రాట్లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  26 March 2024 6:12 PM IST
బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడం ఖాయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. పార్టీ చిన్నాభిన్నమైన కూడా ఇంకా సిగ్గు రాట్లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చెల్లెలు కవిత జైలుకు పోయి.. కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్ బుర్ర పని చేయడం లేదన్నారు. తీవ్ర నిరాశ నిస్పృహలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమ‌ర్శించారు. ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా కేటీఆర్ లో బలుపు, అహంకారం తగ్గలేదని మండిప‌డ్డారు. నోటి దురుసు తగ్గించుకోకపోతే నాలుక చీరేస్తాం.. చీరి చింతకు కడతామ‌ని హెచ్చ‌రించారు. ముఖ్యమంత్రిని హౌలా అంటావా కేటీఆర్.? నువ్వే పెద్ద హౌలా గాడివి. బట్టేబాజ్ గాడివి అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నీ హౌలా పనులు అందరికి తెలుసు.. నీ బతుకే ఒక హౌలా బ్రతుకు అంటూ మండిప‌డ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అన్ని పీకి నిన్ను, నీ అయ్యను ఇంటికి పంపించారు. పార్లమెంటు ఎన్నికల్లో పీకడానికి కూడా ఏమీ లేదు నీ దగ్గర.. ఈ రాష్ట్రంలో ఎవరు జేబు దొంగనో అందరికి తెలుసన్నారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల జేబులు కొట్టి దాచుకున్న వేల కోట్లు కక్కిస్తామ‌న్నారు. దొంగలు కాబట్టే మీ చెల్లె తీహార్ జైల్లో ఉంది.. నువ్వు కూడా చంచల్ గూడ కుపోవడానికి సిద్ధంగా ఉండని హెచ్చ‌రించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతుంది.. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయించడానికి సిగ్గుందా నీకు అని ఫైర్ అయ్యారు.

మీ బతుకులు త్వరలో బయటపడతాయి.. ఎవరు వసూలు రాజానో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి మీరు చేయించిన వసూళ్ల జాబితా వస్తుంది.. సిద్ధంగా ఉండు.. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలను ఎవరు బెదిరించారో మీ ఎలక్షన్ బాండ్లు చూస్తే అందరికి అర్థమైపోతుందన్నారు. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమ‌న్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ సగం ఖాళీ అయింది.. ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తిగా వాష్ అవుట్ అవుతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలుసు.. మీ పార్టీ ఎంపీ అభ్యర్థులను చూస్తేనే వ్యవహారం అర్థమౌతోంది. సిగ్గు లేకుండా నువ్వు నీ బావ హరీష్ రావు అప్పట్లో మా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా..? అని ఫైర్ అయ్యారు.

దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరితే ఎగిరెగిరి పడుతున్నావు.. తలసాని ఏ పార్టీలో గెలిచి నీ అయ్య క్యాబినెట్ లో మంత్రి అయ్యాడో మరిచిపోయావా..? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ లో గెలిచి ఎక్కడ మంత్రిగా పనిచేశారో గుర్తు లేదా..? 10 యేళ్లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యే లను చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు..? అని ప్ర‌శ్నించారు.

Next Story