సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనియ్యం

హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  10 April 2024 3:06 PM IST
సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనియ్యం

హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు. చెడ్డీ గ్యాంగ్ అని హరీష్ రావు అంటున్నారు.. కేసీఆర్ నేతృత్వంలోని మీరే చెడ్డీ గ్యాంగ్‌లాగా రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. హరీష్ రావు రైతులను వేధించి భయపెట్టి అక్రమంగా భూములు కొని ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనియ్యమ‌ని హెచ్చ‌రించారు.

కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తలచుకుంటే మీరు బయటకు రాలేరన్నారు. బీజేపీ తో లోపాయికారి ఒప్పందంతో ఉన్నారు.. బీఆర్ఎస్ కు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతమైన పాలన చేస్తుందని.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు.

ఎన్నికల ముందు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు హరీష్ రావు.. గతంలో అధికారంలో ఉన్నపుడు 4 నెలల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు బీఆర్ఎస్‌.. కనీసం క్యాబినెట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. హరీష్ రావు ఇష్టం వొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. కమిషన్లు తీస్కొని ఫామౌస్ లు కట్టుకున్న నువ్వు మా ముఖ్య మంత్రి గురించి మాట్లాడ్తావా అంటూ ఫైర్ అయ్యారు. నీ అవినీతి మొత్తమ్ బయటకి తీస్తాం.. పట్టపగలు దొంగ తనం చేసే నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడ్తావా.. మా ముఖ్యమంత్రి ని చడ్డీ గ్యాంగ్ అంటావా.. ఎక్కువ మాట్లాడితే తాటా తీస్తామ‌ని హెచ్చ‌రించారు.

Next Story