రూ.8000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల పంచాయతీ కార్యదర్శి ఎసపల్లి నవీన్ కుమార్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు

By Medi Samrat  Published on  12 Sep 2024 2:27 PM GMT
రూ.8000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల పంచాయతీ కార్యదర్శి ఎసపల్లి నవీన్ కుమార్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఓ వ్యక్తి నుంచి రూ.8వేలు లంచం డిమాండ్ తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

ఫిర్యాదుదారుడి కొత్త ఇంటి నంబర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి నవీన్ కుమార్ లంచం అడిగాడు. నవీన్ కుమార్ దగ్గర నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని ట్రౌజర్, కుడి చేతి వేళ్లు, ట్రౌజర్ కాంటాక్ట్ భాగం పాజిటివ్‌గా నిర్ధారించారు. అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం తన వృత్తిని నవీన్ కుమార్ అడ్డంగా పెట్టుకున్నాడని అధికారులు కుమార్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రభుత్వోద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్-1064ను సంప్రదించాలని ఏసీబీ ప్రజలను కోరింది. ఫిర్యాదుదారు వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Next Story