కేసీఆర్ తిరిగి సీఎంగా అవుతారు, తెలంగాణ భవన్‌లో ఉగాది పంచాంగ శ్రవణం

ఉగాది పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఉగాది ఉత్సవాలు నిర్వహించింది.

By Knakam Karthik
Published on : 30 March 2025 4:15 PM IST

Telangana, Kcr, brs, Ugadi Celebrations, Telangana Bhavan

కేసీఆర్ తిరిగి సీఎంగా అవుతారు, తెలంగాణ భవన్‌లో ఉగాది పంచాంగ శ్రవణం

ఉగాది పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఉగాది ఉత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణంలో ఆసక్తికర విషయాలు వినిపించారు. ఈ ఏడాది ప్రజాపాలన దృష్టి తక్కువగా పెట్టే స్థితి ఉందని ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణం చెప్పారు. ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయని అన్నారు. ప్రజాపాలనలో లోపం, గవర్నమెంట్ నడపడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం రాష్ట్రం తీసుకోవడం సంపూర్ణంగా ఉండదన్నారు.

అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు వచ్చే ఏ ఎన్నికలైన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని, కానీ రాజు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడే స్థితి ఉందని, కోర్డులు మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు జరిగే స్థితి ఉంటుందని, ఎన్నికలు ఎక్కువగా వాయిదా పడే ఛాన్స్ ఉందని అన్నారు. శ్రీరాముని జాతకం ఉన్న ఉచ్చస్థితి.. మాజీ సీఎం కేసీఆర్‌ జాతకంలో ఉందని అర్చకులు చెప్పారు. ఈ ఏడాది సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని, తెలంగాణ ప్రజలు ఏ విధమైన ప్రజాపాలన కోరుకుంటున్నారో.. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పట్టం కట్టడానికి అవకాశం ఉన్న సంవత్సరం ఇదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాశీ ఫలాల్లో రాహువు అష్టమంలో ఉన్నప్పటికి అమ్మవారు, నరసింహ స్వామి అనుగ్రహం ఉందన్నారు.

Next Story