కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవు : పద్మారావు గౌడ్

Padmarao Goud Gives Clarity On Party Change. ఊపిరి ఉన్నంత కాలం టీఆర్ఎస్‌ను వీడేది లేదు.. పార్టీలో నాకు లోటు లేదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే

By Medi Samrat  Published on  19 Oct 2022 7:41 AM GMT
కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవు : పద్మారావు గౌడ్

ఊపిరి ఉన్నంత కాలం టీఆర్ఎస్‌ను వీడేది లేదు.. పార్టీలో నాకు లోటు లేదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్ప‌ష్టం చేశారు. కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు చెప్పడం సరికాదని అన్నారు. కేటీఆర్ తో మునుగోడు ఎన్నికల విషయమై చర్చించానని తెలిపారు. నాకు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ఎలాంటి అడ్డు లేదని.. కేసీఆర్ తో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. కేసీఆర్ కుటుంబం మద్దతు తమ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుందని.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని అన్నారు.

బీజేపీలోకి వెళ్తున్నట్లు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయ‌న‌ తిప్పి కొట్టారు. టీఆర్ఎస్ ను వీడేది లేదని పద్మారావు స్పష్టం చేశారు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన.. తాను కూడా పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నాం, ప్రజా అవసరాల దృష్ట్యా సేవలు అందిస్తున్నాం అని తెలిపారు.

సికింద్రాబాద్ లో జూనియర్, డిగ్రీ కళాశాల, హై స్కూల్ 30 కోట్ల రూపాయలతో విద్యార్థులకు అనువుగా నూతన నిర్మాణాలు చేపట్టాము. మెట్టుగూడ, తుకారాం గేట్ లో ఆర్‌యూబీ లను నిర్మించామని తెలిపారు. ఇప్పటికీ 102 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. కళాశాలలు, వైద్యశాల ఏర్పాటుతో పాటు అనేక అబివృద్ది కార్యక్రమాల నిర్మాణాలు చేపడుతున్నాం. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తి కానున్నాయని తెలిపారు.


Next Story