ఓడితే 4వ తారీఖు నా శవయాత్రకు రండి : కౌశిక్ రెడ్డి

నేటితో ఎన్నికల ప్రచారం ముగియ‌నుంది. పోలింగ్‌కు ఒక్క‌రోజే గ‌డువు ఉండ‌టంతో అభ్య‌ర్ధుల‌లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది.

By Medi Samrat  Published on  28 Nov 2023 2:40 PM IST
ఓడితే 4వ తారీఖు నా శవయాత్రకు రండి : కౌశిక్ రెడ్డి

నేటితో ఎన్నికల ప్రచారం ముగియ‌నుంది. పోలింగ్‌కు ఒక్క‌రోజే గ‌డువు ఉండ‌టంతో అభ్య‌ర్ధుల‌లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఈ నేప‌థ్యంలోనే హుజురాబాద్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్ర‌చారంలో భాగంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి తనను ఓటేసీ గెలిపించకపోతే భార్యా, బిడ్డల‌తో కలిసి ఉరివేసుకుంటా.. మా ముగ్గురి శ‌వాల‌ను చూస్తార‌ని అన్నారు. 30న పోలింగ్ ఉంద‌ని.. ఈ ఒక్క‌సారి నాకు ఓటేయ్యండ‌ని అభ్య‌ర్ధించారు. 3న వెలువ‌డే ఫలితాలలో తనను గెలిపిస్తే విజయ యాత్రకు వ‌స్తా.. ఓడితే 4వ తారీఖు నా శవయాత్రకు రండి అని అన్నారు. ఇక మీ ఇష్టం.. మ‌మ్మ‌ల్ని కాపాడుకుంటర‌ని ఆశిస్తున్నా.. ఈ ఒక్క సారి నాకు అవకాశం కల్పిస్త‌ర‌ని భావిస్తున్నా.. మీ ద‌య‌ అంటూ కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.


Next Story