శాంపిల్స్ ఇవ్వ‌డానికి మేము డబ్బాలతో రెడీగా ఉన్నాం : పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య డ్ర‌గ్స్ వార్ న‌డుస్తోంది.

By Medi Samrat  Published on  30 Oct 2024 8:55 AM GMT
శాంపిల్స్ ఇవ్వ‌డానికి మేము డబ్బాలతో రెడీగా ఉన్నాం : పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య డ్ర‌గ్స్ వార్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సవాల్ ను మేము స్వీకరించాము. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని నేను చెప్పాను. అనిల్ కుమార్ యాదవ్ ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ కు వెళ్లారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టెస్ట్ కు రావాలని చెప్పాను. మీరు మాకు చెప్పకుండా వెళ్లి మ‌మ్మ‌ల్ని రమ్మంటే ఎట్లా.? అని ప్ర‌శ్నించారు.

అనిల్ కుమార్ యాదవ్ నాకు మంచి మిత్రుడు.. నేను అనిల్ కుమార్ యాదవ్ ను తిట్టవచ్చు వార్డు మెంబర్ గా గెలవడని.. నా పంచాయతీ అనిల్ కుమార్ యాదవ్ తో కాదు.. రేవంత్ రెడ్డితో నాకు పంచాయతీ అన్నారు. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు.

మేము కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్ ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను.. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్ కు రావాలన్నారు. యూరిన్ శాంపిల్స్ ఇవ్వ‌డానికి మేము డబ్బాలు పట్టుకుని రెడీగా ఉన్నాం.. మా ఎమ్మెల్యేలు అందరూ వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.

రేవంత్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలన్నారు. నన్ను ట్రాప్ చేసినట్లు రాజ్ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారన్నారు. కేసీఆర్ పేరు తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మీటింగ్ అయిందా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పేరు తుడిస్తే చెరిగేది కాదన్నారు. రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి పాలనలోఒక్క వర్గం సంతోషంగా లేదు.. రెండు లక్షల కోట్లు రైతులపై కేసీఆర్ ఖర్చు పెట్టారు.. కేసీఆర్ పాలనలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చాము.. దేశంలో తుగ్లక్ సీఎం రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Next Story