తెలంగాణ.. 17 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో నోటాకు ప‌డ్డ ఓట్లు ఎన్నో తెలుసా.?

తెలంగాణలోని 17 స్థానాలకు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) కు త‌మ ఓటు వేశారు.

By Medi Samrat  Published on  5 Jun 2024 7:00 PM IST
తెలంగాణ.. 17 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో నోటాకు ప‌డ్డ ఓట్లు ఎన్నో తెలుసా.?

తెలంగాణలోని 17 స్థానాలకు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) కు త‌మ ఓటు వేశారు. మొత్తం 1,02,654 మంది ఓటర్లు.. 0.47% మంది నోటాను ఎంచుకోవడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే.. 2019 ఎన్నికల్లో నోటాను ఎంచుకున్న వారు 1.03% కాగా.. ఈ సారి ఆ సంఖ్య త‌గ్గింది.

నియోజకవర్గాల వారిగా నోటాకు ప‌డ్డ ఓట్లు..

మల్కాజిగిరి: 13,366 ఓట్లు

ఆదిలాబాద్: 11,762 ఓట్లు

వరంగల్: 8,380 ఓట్లు

ఖమ్మం: 6,782 ఓట్లు

మహబూబాబాద్: 6,591 ఓట్లు

చేవెళ్ల: 6,423 ఓట్లు

నల్గొండ: 6,086 ఓట్లు

పెద్దపల్లె: 5,711 ఓట్లు

కరీంనగర్: 5,438 ఓట్లు

సికింద్రాబాద్: 5,166 ఓట్లు

భోంగీర్: 4,646 ఓట్లు

మెదక్: 4,617 ఓట్లు

నాగర్ కర్నూల్: 4,580 ఓట్లు

నిజామాబాద్: 4,483 ఓట్లు

మహబూబ్‌నగర్: 4,330 ఓట్లు

జహీరాబాద్: 2,976 ఓట్లు

హైదరాబాద్: 2,906 ఓట్లు

NOTA ఓటు.. ఓటరు అసంతృప్తిని తెలియ‌జేస్తుంది. పోటీలో ఉన్న‌ అభ్యర్థులను కాద‌ని.. మ‌రో ప్రత్యామ్నాయం కోసం ఓట‌రు ఎదురుచూస్తున్న‌ట్లుగా తెలుపుతుంది.

Next Story