వన్ ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని మార్చాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 11:57 AM IST
వన్ ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని మార్చాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు- 2025 జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ.. "గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్డి హైదరాబాద్ మారింది. ఈ రంగానికి సంబంధించి హైదరాబాద్లో నిపుణులున్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయి. హైదరాబాద్ను సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తాం అని సీఎం చెప్పారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయి. ముందు నుంచీ పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సాహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తుంది" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బయో ఆసియా సదస్సు.. హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టింది. హెల్త్ కేర్ రంగం భవిష్యత్‌ను నిర్దేశించడంతో పాటు.. ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఆసియా.. దేశ, విదేశాలను ఆకర్షిస్తోందని.. సీఎం చెప్పారు. బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నాం" అని సీఎం వెల్లడించారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ది, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.