ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు

Orange Travels bus overturned.. Nine people injured. న‌ల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద మంగళవారం తెల్లవారుజామున 65వ జాతీయ రహదారిపై

By Medi Samrat
Published on : 13 Dec 2022 7:00 PM IST

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు

న‌ల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద మంగళవారం తెల్లవారుజామున 65వ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అతివేగం కారణంగా వట్టిమర్తి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)కి తరలించారు. మరో రోడ్డు ప్రమాదంలో నార్కట్‌పల్లి శివారులో 12వ బెటాలియన్‌కు చెందిన ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story