ఆపరేషన్ సింధూర్..తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

By Knakam Karthik
Published on : 7 May 2025 1:45 PM IST

Telangana, Hyderabad News, Cm Revanthreddy, Operation Sindoor, Security Arrangements

ఆపరేషన్ సింధూర్..తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదు. అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు. ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి...అని సీఎం సూచించారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు సిద్దం చేసుకోవాలి. అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల అందుబాటుపైనా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. రెడ్ క్రాస్‌ను సమన్వయం చేసుకోవాలి. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి...అని సీఎం సూచించారు.

రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలి. ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలి. హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్‌లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలి...అని సీఎం రేవంత్ పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.

Next Story