బుల్లెట్టు బండి పాటకు కాలు కదిపిన నర్సు.. వీడియో వైరల్..!
Nurse Dance For Bullettu Bandi Song. బుల్లెట్టు బండి పాట ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. మోహన భోగరాజు ఆ పాటలో అభినయంతో
By Medi Samrat Published on
21 Aug 2021 12:21 PM GMT

బుల్లెట్టు బండి పాట ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. మోహన భోగరాజు ఆ పాటలో అభినయంతో ఆకట్టుకోగా చాలామంది అనుకరిస్తూ బీట్‌కు తగ్గట్టుగా వీడియోలు చేస్తున్నారు. ఇటీవల ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకోవడమే కాకుండా.. ఏకంగా యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచి సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఎంతో మంది ఈ పాటకు కాళ్లు కదపగా.. తాజాగా మరోమారు ఈ పాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చక్కర్లు కొడుతోంది. ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో నర్సు ఈ పాటతో డాన్స్ చేసి ఆకట్టుకుంది.
స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పీహెచ్‌సీలో కాంట్రాక్ట్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో కూడా వైరల్ గా మారడంతో ఆమెకు మెమో జారీ అయిందని సమాచారం. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంతోషంగా పాటకు డ్యాన్స్ చేసింది అని సిబ్బంది చెబుతుండగా.. నర్సు యూనిఫాంలో ఆసుపత్రిలోనే డాన్స్ చేయడంపై పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమచారం.
Next Story