కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌.. తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నో

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు.

By అంజి  Published on  9 Jan 2025 1:37 PM IST
BRS, KTR,Supreme Court, Telangana,  Formula E car race

కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌.. తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నో

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఫార్ములా - ఈ రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్‌ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అత్యవసరంగా విచారణ జరిపించాలని కేటీఆర్ తరఫు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీంకోర్టు సీజేఐ నిరాకరించారు. మరోవైపు ఫార్ములా - ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రేస్‌ నిర్వహణకు ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ ఇచ్చిన ఆదేశాలపై కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అర్వింద్‌ కుమార్‌ ఇచ్చిన స్టేట్మెంట్‌ ఆధారంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

Next Story