తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు: సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపరేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 12:50 PM IST
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు: సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపరేరు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కేఆర్‌సీ క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రతి రోజూ మేము మల్టీనేషనల్ సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో, పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో, గత ఏడాది సంతకం చేసిన ఎంవోయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కేవలం ఏడాది కాలంలోనే దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నా. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్‌గా నిలిచాం. మన దగ్గర అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయి. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని నేను ముందు చెప్పినప్పుడు.. అది సాధ్యం కాదని కొందరు అన్నారు. రెండు సార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు.."అని సీఎం అన్నారు.