ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి శోభ యాత్రలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా యాత్ర కొనసాగేలా చూడాలని, అనవసరమైన అడ్డంకులు సృష్టించవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు ఆదేశాలు ఇవ్వాలని రాజా సింగ్ కోరారు.
ముఖ్యమంత్రికి రాసిన లేఖలో రాజా సింగ్, శ్రీరామ నవమి శోభ యాత్ర ఏప్రిల్ 6న ధూల్‌పేటలోని ఆకాశ్‌పురి హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ యాత్ర గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుల్తాన్ బజార్‌లోని హెచ్‌విఎస్ పబ్లిక్ స్కూల్ వద్ద ముగుస్తుందని వివరించారు. 2010 నుండి ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్నానని, ఈ 15 సంవత్సరాలలో ఒక్కసారి కూడా హైదరాబాద్ లో శాంతికి భంగం కలిగించలేదన్నారు రాజా సింగ్. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది రామభక్తులు భక్తితో, క్రమశిక్షణతో యాత్రలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.