తెలంగాణలో ఇంధన కొరత లేదు, పుకార్లను నమ్మవద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో చమురు కంపెనీల అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు

By -  Knakam Karthik
Published on : 28 March 2026 8:16 PM IST

Telangana, KishanReddy, Fuel Supply, Hyderabad, Petrol Diesel, No Crisis, Central Government

తెలంగాణలో ఇంధన కొరత లేదు, పుకార్లను నమ్మవద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో చమురు కంపెనీల అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, దేశం ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొందని, పెట్రోలియం ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం వల్ల అక్కడ వచ్చే మార్పులు మనపై ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలోనే చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను, రైల్వే విద్యుదీకరణను ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశీయంగా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు దిగుమతులను కూడా పెంచి ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే ఉజ్వల పథకం ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా గ్యాస్ సౌకర్యం కల్పించి, కట్టెల పొయ్యిల నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తున్నామని ఈ సందర్భంగా రెడ్డి గుర్తుచేశారు.

Next Story