పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య..

Nizamabad Couple Commit Suicide. నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నిండు ప్రాణాల‌ను

By Medi Samrat
Published on : 27 March 2021 5:24 PM IST

పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య..

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నిండు ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. వివ‌రాళ్లోకెలితే.. జిల్లా కేంద్రంలోని జక్రాన్‌పల్లి మండలం సికింద్రపూర్‌ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఆర్మూర్‌ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన చిత్తరి సాయి కుమార్(30), శైలజ(28)లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు, శైలజ భర్త కొంతకాలం క్రితం మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Next Story