అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆరోగ్య ప‌రిస్థితి పై తాజాగా నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2023 1:17 PM IST
అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుద‌ల‌

వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆరోగ్య ప‌రిస్థితి పై తాజాగా నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుద‌ల చేశారు. ఆమె ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉంద‌న్నారు. వెంటిలేట‌ర్‌, ఎక్మోపై చికిత్స కొన‌సాగుతోంద‌న్నారు. ప్రీతికి డ‌యాల‌సిస్ చేస్తున్న‌ట్లు తెలిపారు. నిపుణులైన వైద్య బృందం ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ముందు త‌న ఆమె త‌న త‌ల్లికి ఫోన్ చేసి ఆవేద‌న‌ను వెళ్ల‌బోసుకుంది. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.

‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒక‌టే. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకపోయింది. సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై కంప్లైంట్ ఇస్తే.. సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్ఓడీ నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు’’ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది.

సైఫ్‌తో తాను మాట్లాడతానని, సమస్య లేకుండా చూస్తానని తల్లి ఆమెకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది.

Next Story