మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధులు కోర్టు ఊహించని షాకిచ్చింది. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుదీర్ఘ విచారణల అనంతరం వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 5వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో నాగార్జున తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ వేసిన కేసును తాజాగా విచారించిన కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.