అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి మరణించినట్లుగా అధికారులు తెలిపారు. 24 ఏళ్ల పవన్ శుక్రవారం నాడు స్నేహితులతో సరదాగా గడిపాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా మరణించినట్లుగా ప్రకటించారు. పవన్ కుమార్ రెడ్డి రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఒక కంపెనీలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో రెండో నెలల్లో ఎంఎస్ పూర్తి అయిపోతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.