మునుగోడు ఉప ఎన్నికల ఫలితం : ఈ సారి కూడా మిషన్ చాణక్య చెప్పిందే నిజ‌మ‌వుతుందా..?

Munugode Exit Poll Analasys By Mission Chanakya. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై మిషన్ చాణక్య తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది

By Medi Samrat  Published on  5 Nov 2022 2:45 PM GMT
మునుగోడు ఉప ఎన్నికల ఫలితం : ఈ సారి కూడా మిషన్ చాణక్య చెప్పిందే నిజ‌మ‌వుతుందా..?
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై మిషన్ చాణక్య తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. మిషన్ చాణక్య సంస్థ మునుగోడు విజేత బీజేపీ అని తేల్చేసింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ సంస్థ వెల్లడించింది. మిషన్ చాణక్య సర్వే ప్రకారం... మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి 40.16 శాతం ఓట్లు రానుండగా... టీఆర్ఎస్ కు 38.38 ఓట్లు రానున్నట్లు తేలింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి మాత్రం కేవలం 14.93 శాతం ఓట్లు రానున్నట్లు తేల్చింది. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన అందోజు శంకరాచారికి 4.29 శాతం ఓట్లు రానున్నట్లు మిషన్ చాణక్య తేల్చింది. ఇతరులకు 1.9 శాతం ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య వెల్లడించింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 3,900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించనున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. మెజారిటీలో 1,400 ఓట్ల మేర హెచ్చుతగ్గులు ఉండవచ్చని మిషన్ చాణక్య తెలిపింది. తెలంగాణలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మిషన్ చాణక్య వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమైన సంగతి తెలిసిందే..!


Next Story