రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయం : రేవంత్

MP Revanth Reddy Comments on Farmer loan waiver. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  2 Aug 2023 8:14 PM IST
రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయం : రేవంత్

రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, వత్తిడి ఫలితంగానే నేడు కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిదుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసి రుణ మాఫీ గురించి డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. రుణమాఫీ అమలు చేయకపోతే బ్యాంక్ ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించిన‌ట్లు వెల్ల‌డించారు. కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామ‌ని పేర్కొన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ 4 సంవత్సరాలు ఆలస్యం అయ్యిందని విమ‌ర్శించారు. రైతు ఋణమాఫీపై అన్ని వడ్డీలతో సహా మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అందేవరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుందని భ‌రోసా ఇచ్చారు.

Next Story