ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు.? అని ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవన్న ని పట్టుకోండని సవాల్ విసిరారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవన్న పారిపోయాడు. ప్రజ్వల్ ని బలపరిస్తే.. నన్ను బలపర్చినట్టే అని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. బీజేపీ నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు సైలెంట్ గా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేస్తే మళ్ళీ టికెట్ ఇచ్చారు. దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? అని ప్రశ్నించారు. చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోదీ మాట్లాడడం లేదన్నారు. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్ కి వస్తున్నారు. జవాన్లు, రైతులు అనే రెండు పెద్ద సెక్యులర్ ఫోర్సెస్ దేశంలో ఉన్నాయన్నారు. పెద్ద ఛాతీ ఉండడం కాదు. దానిలో గుండె, మనసు కూడా ఉండాలన్నారు.