బిగ్‌బ్రేకింగ్ : రేవంత్‌తో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భేటీ

MP Komatireddy Venkatreddy Meet With Revanth Reddy. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కొద్దిసేప‌టిక్రితం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు

By Medi Samrat
Published on : 20 Jan 2023 6:32 PM IST

బిగ్‌బ్రేకింగ్ : రేవంత్‌తో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భేటీ

గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కొద్దిసేప‌టిక్రితం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. గ‌త కొంత‌కాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదిలావుంటే.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే శుక్ర‌వారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయ‌న‌కు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఠాక్రే నేటి నుంచి గాంధీభవన్ లో మూడురోజుల పాటు టీపీసీసీ, అనుబంధ సంఘాల నేతలతో వరస సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై కూడా ఠాక్రే నేతలతో చర్చించనున్నట్లు స‌మాచారం.


Next Story