ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటి అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ కోరిన అరగంటలో అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ సమస్యలు అడిగి తెలుసుకున్నారని అన్నారు. మూసి నదిలో నీరు శుద్ధి చేయకుండా కిందికి వెళితే నల్గొండ జిల్లా ప్రజలు లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారని.. నమామి గంగ తరహాలో మూసినది ప్రక్షాళన చేయాలని మోదీని కోరారని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ నిర్మాణంపై ప్రధానితో చర్చించానని.. 2022 ఏప్రిల్ లో ప్రారభించాలని కోరినట్లు తెలిపారు.
జీఎంఆర్ సంస్థ హైవే నిర్మాణం చేపట్టకుండా ఆర్బిట్రేషన్ కు వెళ్లి మెండిగా వ్యవహరిస్తుందని.. 2025లో చేపడతామతమని అంలున్నారని.. ఇప్పటికే గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళానని తెలిపానని.. ప్రధానిని సైతం ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. రేపు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే నిర్మణంపై రివ్యూ చేయబోతున్నారని తెలిపారు. జీఎంఆర్ నిర్మణం చేయకపోతే కొత్త సంస్థతో అయినా నిర్మాణం చెపిస్తామని గడ్కరీ అన్నారని.. ఈ విషయమై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.