మంత్రి కేటీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. 6 నెలలుగా చేనేత మిత్ర సబ్సిడీ రాకపోవటంపై మంత్రి కేటీఆర్‌కు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ వ్రాశారు. చేనేత మరియు అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40 శాతం సబ్సిడీ 6 నెలలు దాటినా రావటం లేదని.. దీంతో చేనేత కార్మికులు ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే సబ్సిడీని విడుదల చేయాలంటూ లేఖలో కోరారు.
చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులు పట్టు నూలు కొనుగోలు చేశారు. 2 నెలలకు ఒక్కసారి అందాల్సిన సబ్సిడీ 6 నెలలు అయిన అందటం లేదు. పట్టు కొనుగోలు చేసి 6 నెలలు గడిచినా వారికి అందాల్సిన 40% సబ్సిడీ రావడం లేదు. పట్టు నూలు ఒక్క కేజీ 6000కి పెరగడంతో కార్మికులు మగ్గాలు బంద్ చేశారు. పనిలేక చేనేత కార్మికుల ఇల్లు గడవడం గగనం అయ్యింది. చేనేత కార్మికులు ఒక్క కేజీ పట్టు నూలు ధారంను 6000 రూపాయలు పెట్టి మార్కెట్లో కొంటున్నారూ.. సబ్సిడీ మాత్రం ప్రభుత్వం 4700 రూపాయలకు మాత్రమే ఇస్తుంది. త్వరలోనే ఈ సమస్యని పరిష్కరించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో డిమాండ్ చేశారు.