కొద్ది నెలల కిందట కేటీఆర్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకానొక దశలో కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతారని.. కేసీఆర్ దేశ రాజకీయాలను చూసుకుంటారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాయి. కానీ పరిస్థితుల్లో మార్పులు వచ్చింది. ఈ ప్రచారం తప్పని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం నిరూపించింది.
అయితే ఊహించని విధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాడని.. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకే ఈటలపై కుట్ర జరిగిందని అరవింద్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని అన్నారు. కేసీఆర్ కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే కేటీఆర్ ను హుజూరాబాద్ లో పోటీ చేయించాలని సవాల్ విసిరారు.