మీడియా ముందుకు రండి.. కేటీఆర్‌కి బుద్ధి చెప్పండి : ఎంపీ ఛామల
గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు.
By - Medi Samrat |
గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. గ్రూప్ 1 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారన్నారు. గ్రూప్ వన్ పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర మూడు కోట్ల రూపాయలు లెక్కన తీసుకొని ప్రభుత్వం వాళ్ళను ఎంపిక చేసిందని అంటున్నారు.. మీ హయాంలో మీరెట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు.. మీ హయాంలో గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ 4 పెట్టే పరిస్థితి లేదు.. మా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లుతున్నామన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డంకులు రావద్దన్న సదుద్దేశంతో గ్రూప్ వన్ పరీక్షలు పెట్టామని తెలిపారు.
563 మంది తల్లిదండ్రులు.. ఒక్కొక్కరు మూడు కోట్లు పెట్టే స్తోమత ఉంటుందా.? మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వని మీరు.. మీకు ఓటేయని ప్రజలు బాధపడుతూ ఉండాలనుకుంటున్నారా? రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల మీద నీకు ప్రేమ లేదు అన్నారు. అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తూ ఇండియాకు వచ్చి మంత్రి పదవి చేపట్టిన నీవు ప్రజలను తప్పుదోవ పట్టించెట్లు ఎలా మాట్లాడతావు అని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నావు.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ కి గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన నిరుద్యోగుల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి బుద్ది చెప్పాలన్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు నిజమా కాదా తెలియాలి అంటే 563 గ్రూపు వన్ ఉద్యోగుల తల్లిదండ్రులు స్పందించాలన్నారు. ఈ రోజు నేను మాట్లాడిన తర్వాత తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు చెయ్యండి.. మీ ఆర్థిక స్థోమతను చెప్పండి.. మూడు కోట్లు మీ దగ్గర ఉందా లేదా మీ స్థాయి ఏంటో చెప్పాలి.. ఇది పార్టీ సమస్య కాదు.. మన బిడ్డల సమస్య.. రోడ్డుమీదికి రావాలి.. ప్రెస్ మీట్ లు పెట్టాలి.. లేని సమస్యను సృష్టిస్తున్న కేటీఆర్ ను చెప్పు దెబ్బలు కొట్టాలన్నారు.