అలాంటి వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు : ఎంపీ చామల

జనగామ మున్సిపాలిటీలోలోని 30వార్డులు ఉండగా 25మంది అభ్యర్థులను జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, జనగమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు జనగామ మున్సిపాలిటీ తో పాటు చేర్యాల మున్సిపాలిటీలోనీ 12వార్డులకు గానూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు.

By -  Medi Samrat
Published on : 2 Feb 2026 1:05 PM IST

అలాంటి వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు : ఎంపీ చామల

అలాంటి వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు : ఎంపీ చామల

జనగామ మున్సిపాలిటీలోలోని 30వార్డులు ఉండగా 25మంది అభ్యర్థులను జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, జనగమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు జనగామ మున్సిపాలిటీ తో పాటు చేర్యాల మున్సిపాలిటీలోనీ 12వార్డులకు గానూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. సామ, దాన, భేద‌ దండోపాయాలు ఉపయోగించి దొంగ దారిలో గెలవడానికి ప్రయత్నించే వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ఈ తొండి చేసి, కోవర్టు రాజకీయాలు చేసే ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నాయకులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ.. కానీ పార్టీలోనే ఉంటూ పార్టీని మోసం చేసే వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు అని అన్నారు.

]రాష్ట్ర వ్యాప్తంగా సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై బలాదూర్‌గా నిరసనలు చేస్తున్నరు.. ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుండి మిషన్ తెచ్చి ఫోన్లు ట్యాప్ చేసినరు.. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రముఖులైన ఐదుగురిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకర‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆలుమ‌గ‌ల‌ ఫోన్లు ట్యాప్ చేశార‌ని కేసీఆర్ బిడ్డ కవితే చెబుతుందన్నారు.

నాకు ఏ పదవులొద్దు అని చెప్పి..నీళ్ళు,నిధులు, నియామకాల పేరుతో పది సంవత్సరాలు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు వేల కోట్లు దోచుకున్నారు. వేల కోట్ల అక్రమ సంపాదనతో రాజకీయాలు చేయాలని చూస్తున్న ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆత్మగౌరవం అనడం సిగ్గుచేటు అన్నారు. ఎంతో మంది బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమకారులను అరెస్ట్ చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా అని ప్ర‌శ్నించారు. కోదండరాం, గద్దర్ అన్న వంటి వారిని వేధించినప్పుడు గుర్తు రాని ఆత్మగౌరవం.. ఫోన్ ట్యాపింగులో నోటీసులిస్తే గుర్తువచ్చిందా అని ప్ర‌శ్నించారు.

డిసెంబర్ 4న ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి ఇంటలిజెన్స్ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ డేటాను తగలబెట్టినారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.. అధికార దాహంతో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి అధికారం కోల్పోయే సరికి ఆగమాగమైతున్నారు.. కాంగ్రెస్ నాయకులు మనస్పర్థలు పక్కన పెట్టి చేర్యాల మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు. మరోసారి దొంగ రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తే.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓట్లతో పల్ల పల్ల కొట్టుర్రి అని పిలుపునిచ్చారు.

మిగులు రాష్ట్రంగా ఉన్న పది సంవత్సరాల పాలనలో సన్న బియ్యం ఎందుకు ఇయ్యలే, ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఎందుకు ఇవ్వలేద‌ని ప్ర‌శ్నించారు. విదేశాలకు వెళ్ళి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త సిటీ(ఫ్యూచర్ సిటీ) నిర్మించ బోతున్నామ‌న్నారు. చేర్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో, దొంగ దారులలో కాకుండా నిజాయితీతో గెలవాలని సవాల్ విసిరారు.

Next Story