సీఎం 10 నెలల్లో ఒక్కరోజు సెలవు తీసుకోలేదు.. కేసీఆర్ పదేళ్లలో..
ఇచ్చిన హామీల మీద మీ పదేళ్లలో ఇచ్చిన రెండు మేనిఫెస్టో లు.. మా ఒక్కో మేనిఫెస్టో తీసుకుని రండి చర్చకు సిద్దం అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 3:01 PMఇచ్చిన హామీల మీద మీ పదేళ్లలో ఇచ్చిన రెండు మేనిఫెస్టోలు.. మా ఒక్క మేనిఫెస్టో తీసుకుని రండి చర్చకు సిద్దం అని బీఆర్ఎస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. కేసిఆర్ పదేళ్లలో పది సార్లు సచివాలయంలో కూర్చున్న దాఖలాలు లేవు అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి సెలవు తీసుకోలేదన్నారు. బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. తెలంగాణ కు ఎంత వడ్డీ ఉంది అనేది నెల రోజుల తర్వాత తేలింది.. నీళ్ళు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ను తుంగలో తొక్కారన్నారు.. చివరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చేతులెత్తేశారని అన్నారు.
మా ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కలు చెబుతామన్నారు. మోడీ ట్వీట్ కి రేవంత్ రెడ్డి స్పందిస్తే.. దానికి హరీష్ రావు ట్వీట్ చేశారన్నారు. ప్రభుత్వం మీద అపవాదు వేయడం తప్ప మెరుగైన పాలన అందించేలా సలహాలు ఇవ్వడం లేదన్నారు. BRS హాయంలో రుణమాఫీకి వడ్డీ మాత్రమే కట్టారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా రుణమాఫీ చేశారన్నారు. మీకన్నా మెరుగైన పాలన అందించామా లేదా చెప్పండి... BRS అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ పడిందన్నారు. దానికోసం బావ బామ్మర్ది మధ్య పోటీ పెరిగింది.. టీఆర్ఎస్ పార్టీ నీ తెలంగాణ కోసం పెట్టలేదు.. కలెక్షన్లు.. కమిషన్లు దండుకోవడానికి టీఆర్ఎస్ పెట్టారన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ లో రబ్బరు చెప్పుల హరీష్ రావు మంత్రి అయ్యాడన్నారు. కాంగ్రెస్ పుణ్యాన మీ మామ కేసిఆర్ సీఎం అయ్యాడు.. మీ బావ లీడర్ అయ్యిండు. కేకే మహేందర్ రెడ్డి నీ కాదని కేటీఆర్ కి టిక్కెట్ ఇచ్చి కేసిఆర్, మహేందర్ రెడ్డి కి అన్యాయం చేశారన్నారు.
రాజ్యాంగం కూడా తెలియకుండా మళ్ళీ ఎన్నికలు పెడితే వంద సీట్లు వస్తాయి అంటున్నారు సిగ్గు లేకుండా.. ఒక్క పార్లమెంట్ సీటు అయిన గెలుచుకున్నారా మీరు..? సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా మరో పదేళ్ళు సీఎంగా కొనసాగితారన్నారు. పీఆర్పీ లో అప్పుడు.. బీజేపీ లో ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గెలిచాడు. బీజేపీ నేతగా ఉండి తాము అధికారంలోకి వస్తామని కూడా చెప్పకుండా.. BRS వస్తుందని మహేశ్వర్ రెడ్డి చెబుతున్నాడన్నారు.