తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని భువనగిరి లోక్ సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం-2014లో ఉంటే అప్పటి నుండి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్ లోనే ఎందుకు చేసారు? అని ప్రశ్నించారు. ప్రధాని కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయంపై తక్షణమే పోరాటం చెయ్యాలని డిమాండ్ చేశారు.