హైడ్రాను దానితో పోల్చి తికమక పెట్టొద్దు : ఎంపీ చామల
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు ప్యాకేజ్ ని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు
By Medi Samrat Published on 4 Sept 2024 7:31 PM ISTకేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు ప్యాకేజ్ ని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదన్నారు. యువరాజు కేటీఆర్, ఎలెన్ మాస్క్ x ప్లాట్ పామ్ మీద ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ఎక్స్ లో మెసేజ్ లు పెట్టి నవ్వుల పాలు అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్ బుల్డోజర్ పాలన మీద సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిందని.. తెలంగాణ హైడ్రాపై కోర్టు తీర్పు ఇచ్చినట్లు కేటీఆర్ వక్రీకరిస్తున్నారని అన్నారు. హైడ్రాపై ప్రజలను తికమక పెట్టడానికి కేటీఆర్ అలా చేస్తున్నారని అన్నారు. హైడ్రాను బుల్డోజర్ తో పోల్చి తికమక పెట్టొద్దన్నారు. బీఆర్ఎస్ లో రెండు గ్రూప్ లు ఉన్నాయన్న కిరణ్ కుమార్ రెడ్డి.. ఖమ్మంలో రెండు బీఆర్ఎస్ గ్రూప్ లు కొట్టుకుంటే.. కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు పెట్టారని అన్నారు. కేటీఆర్ ఇప్పుడు ఏ దేశంలో ఉండో ఎవరికి తెలియదన్నారు.
కేటీఆర్ దయాదాక్షిణ్యాలతో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఎక్కడ పోయారన్నారు. ఓపెన్ టాప్ జీప్ ఎక్కి మాట్లాడటం కాదు.. ప్రజల కష్టాలను తీర్చాలన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా రేవంత్ రెడ్డి హైడ్రాను ముందుకు తీసుకపోతారన్నారు. హైదరాబాద్ లో లేక్స్ ను కాపాడుతం అని రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లో పెట్టారు.. మాకు ప్రజా పాలన అందియ్యాలన్న పట్టుదల ఉంది.. ప్రజల కోసం మంచి చేసే హైడ్రాపై మీ డ్రామా ఏంటి అని ప్రశ్నించారు.