కేసీఆర్‌ను నమ్మి మోసపోయా : మోత్కుపల్లి న‌ర్సింహులు

సీఎం కేసీఆర్ ను నమ్మి మోసపోయాన‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీమంత్రి మోత్కుపల్లి న‌ర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on  24 Sept 2023 8:32 PM IST
కేసీఆర్‌ను నమ్మి మోసపోయా : మోత్కుపల్లి న‌ర్సింహులు

సీఎం కేసీఆర్ ను నమ్మి మోసపోయాన‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీమంత్రి మోత్కుపల్లి న‌ర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆరే నన్ను పిలిచారు.. ఆయనే దూరం పెట్టార‌ని వాపోయారు. 6 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నన్ను అవమానించారని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గరకే ఈజీగా వెళ్లగలిగాను.. కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వటం లేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో శుభ్రం చేసుకునే రకం కేసీఆర్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకుంటే బీఆర్ఎస్ కే నష్టం అన్నారు. నా మద్దతు లేకుండా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదని అన్నారు. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ బలపడిందన్నారు. 30 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ గెలుపోటములను ప్రభావితం చేస్తారని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి నా తమ్ముడు.. అత‌డితో నాకు శత్రుత్వం లేదని మోత్కుపల్లి నరసింహులు అన్నారు.

Next Story