రేవంత్‌రెడ్డిది శనిపాదం.. మోత్కుపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Motkupalli Narasimhulu Fires On Revanth Reddy. బీజేపీని వీడి అధికార‌ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు

By Medi Samrat  Published on  29 Aug 2021 9:11 AM GMT
రేవంత్‌రెడ్డిది శనిపాదం.. మోత్కుపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీని వీడి అధికార‌ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు విప‌క్షాల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం అమ‌లుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ మోత్కుప‌ల్లి త‌న స్వ‌రం బ‌లంగా వినిపిస్తున్నారు. ఈ నేఫ‌థ్యంలోనే దళితబంధు పథకంపై విపక్షాల కుట్రలకు నిరసనగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. తాను 30 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని.. ఇంత‌వ‌ర‌కూ ఏ సీఎం కూడా కేసీఆర్‌లా దళితుల అభివృద్ధి కోసం కృషిచేయలేదన్నారు. దళితుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్‌ ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ సంద‌ర్భంగా పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై మోత్కుప‌ల్లి విరుచుకుప‌డ్డారు. రేవంత్‌రెడ్డిది శనిపాదం అని మోత్కుపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో టీడీపీని సర్వనాశనం చేసింది రేవంత్‌రెడ్డేన‌ని.. ఆయన జీవితం మొత్తం మోసమేనని.. వందలకోట్లు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆరోప‌ణ‌లు చేశారు. సొంత ఊరిలో దళితులను గౌరవించని రేవంత్‌కు.. వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దళితబంధుపై విమర్శలు చేస్తున్న రేవంత్‌ను.. దళితులు తమ ఊరికి రానీయొద్దని అన్నారు. ఇక‌ బీజేపీ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఎవరికోసం చేస్తున్నాడని.. పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు.


Next Story