Telangana: కొడుకు డబ్బులు ఇవ్వట్లేదని.. తల్లిని కిడ్నాప్‌ చేశారు

కొడుకు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని.. అతని తల్లిని కిడ్నాప్‌ చేశాడో వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

By అంజి  Published on  8 Nov 2024 8:35 AM IST
mother kidnap, money, Sirisilla district, Telangana, Crime

Telangana: కొడుకు డబ్బులు ఇవ్వట్లేదని.. తల్లిని కిడ్నాప్‌ చేశారు

కొడుకు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని.. అతని తల్లిని కిడ్నాప్‌ చేశాడో వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ అర్బన్‌ మండలం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన పల్లపు శ్రీనివాస్‌ లేబర్‌గా పని చేస్తున్నాడు. అవసరం ఉన్నవారికి లేబర్లను పంపిస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన లాలూ దేవకర్‌ అనే కాంట్రాక్టర్‌ కర్ణాటకలోని తోటల్లో చెరుకు నరికే కాంట్రాక్ట్‌ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కూలీల కోసం దేవకర్.. శ్రీనివాస్‌ను సంప్రదించాడు. లేబర్లను పంపిస్తానని చెప్పి.. గతేడాది దేవకర్‌ దగ్గర రూ.3.80 లక్షలు తీసుకున్నాడు శ్రీనివాస్.

ఆ తర్వాత కర్నాటకలోకి చెరుకు తోటల్లో పని చేసేందుకు కూలీలతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే కూలీలు అక్కడికి పనికి వెళ్లలేదు. దీంతో అప్పటి నుండి దేవకర్, శ్రీనివాస్‌ మధ్య డబ్బుల విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మొన్న ఉదయం సమయంలో శ్రీనివాస్‌ ఇంటికి దేవకర్‌ కొంతమంది మనుషులను తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్‌ ఇంటి దగ్గర లేకపోవడంతో.. అతని భార్యను సోనిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె తప్పించుకుని పక్కింట్లో దాక్కుంది.

దాంతో శ్రీనివాస్‌ తల్లి పల్లపు భీమాబాయిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లాడు దేవకర్. వెంటనే కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వేములవాడ పోలీసులు.. ప్రత్యేక బృందాన్ని మహారాష్ట్రకు పంపించారు. దేవకర్‌, అతని మనుషులు నాందేడ్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అక్కడికి చేరుకుని, కిడ్నాప్ చేసిన వారిలో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. గురువారం రాత్రి భీమాబాయిని, ఇద్దరు కిడ్నాపర్లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. కారు నెంబర్‌, సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును పరిష్కరించినట్టు సీఐ తెలిపారు.

Next Story