ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఉపశమనం లభించింది. తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 24 వరకు పోలీసుల ఎదుట హాజరుకావడానికి మినహాయింపు ఇచ్చింది. ఈ కేసును డిసెంబర్ 24కి వాయిదా వేసింది. జర్నలిస్టులపై దాడికి సంబంధించి పోలీసులు ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్‌ను కోర్టు విచారించింది. తన నివాసం వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఘటనలో ఆయన ఆగ్రహానికి లోనై జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేశారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని ఈ నేపథ్యంలో తాను పోలీసులు ఎదుట విచారణ నిమిత్తం హాజరు కాలేనంటూ మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం రాత్రి 8.30 గంటలకు మోహన్ బాబును గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లోని అత్యవసర విభాగంలోకి తీసుకొచ్చారు.