కొవిడ్ వ్యాక్సిన్‌పై కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు.. నెటిజ‌న్ల ట్రోలింగ్‌

Modi invented vaccine for Covid, says Kishan Reddy. కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైర‌ల్ అవ‌డంతో

By Medi Samrat  Published on  17 Oct 2022 10:53 AM GMT
కొవిడ్ వ్యాక్సిన్‌పై కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు.. నెటిజ‌న్ల ట్రోలింగ్‌

కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైర‌ల్ అవ‌డంతో అధికార టీఆర్ఎస్ నాయ‌కులు ట్విటర్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. కోవిడ్‌కు ప్ర‌ధాని మోదీ ధైర్యంగా వ్యాక్సిన్‌ను కనుగొన్నారని కిషన్‌రెడ్డి చెప్పడం వీడియోలో విన‌వ‌చ్చు. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు, ట్విటర్ యూజ‌ర్లు ట్రోల్ చేస్తున్నారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి ఈ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలివెల గ్రామంలో ఆదివారం రాత్రి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్‌షో సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ అనుచరులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీ జెండాలతో కిషన్‌రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పలివెల గ్రామం మీదుగా కిషన్‌రెడ్డి రోడ్‌షో వెళుతుండగా సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇరువర్గాలను పోలీసులు శాంతింప‌జేయ‌గా కిష‌న్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు.

అయితే కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ యువ‌నేత క్రిశాంక్ ప్పందించారు. వీడియోను షేర్ చేస్తూ.. ''మీకు తెలుసా..? నరేంద్రమోదీ ఓ శాస్త్రవేత్తా..? అవును.. ప్రధాని మోదీ ధైర్యంగా కోవిడ్‌కు వ్యాక్సిన్‌ను కనుగొన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నార''ని రాసుకొచ్చారు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో ఛ‌లోక్తులు విసురుతున్నారు.


Next Story
Share it