ఇక్కడ చూసే.. అక్కడ నీట్ పేపర్ లీకేజీ చేశారు : ఎమ్మెల్సీ వెంకట్

బీఆర్ఎస్‌ నాయకులు పాలనలో ఎప్పుడు విద్యార్ధి, నిరుద్యోగులకు అందుబాటులో లేరని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు

By Medi Samrat  Published on  17 Jun 2024 3:45 PM GMT
ఇక్కడ చూసే.. అక్కడ నీట్ పేపర్ లీకేజీ చేశారు : ఎమ్మెల్సీ వెంకట్

బీఆర్ఎస్‌ నాయకులు పాలనలో ఎప్పుడు విద్యార్ధి, నిరుద్యోగులకు అందుబాటులో లేరని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ పాలనలో ప్రజా సమస్యలపై మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత జీవో 55 రద్దు చేసి.. 11,000 డీఎస్సీ పోస్టు లు ఇచ్చామని పేర్కొన్నారు. జీవో నెంబర్ 3 తీసుకువచ్చి హారిజాంటల్ ఇష్యూ ను పరిష్కారం చేసామన్నారు. పదేండ్ల లో మీరు సృష్టించిన సమస్యలు పరిష్కారం చేస్తూ విద్యార్థులకు న్యాయం చేస్తున్నామన్నారు.

మీ పాలనలో ఒక్క రోజు మూడు ఉద్యోగాలకు ప‌రీక్ష‌లు ఉన్నాయి అంటే ఎవరు పట్టించుకోలేదు.. కానీ మేము అలా చేయలేదు.. ఎగ్జామ్‌, ఎగ్జామ్‌కు గ్యాప్ పెడుతున్నామన్నారు. మీకు, మీ బామ్మర్దికి జరుగుతున్న గొడవలు బయటికి రాకుండా ఉండడం కోసం ఇవన్నీ సృష్టిస్తున్నారు. పదేండ్ల మీ పాలన.. ఆరు నెలల మా పాలనపై బహిరంగ చర్చకు మేము రెడీ అని స‌వాల్ విసిరారు. హరీష్ రావు పేషీలో పని చేసిన ఒక వ్యక్తి స్కాం లో అరెస్ట్ అయ్యారన్నారు. ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచామన్నారు. సమస్య ఉన్నా చెప్పుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నాము. మీ లాగా మేము గొంతులు నొక్కడం లేదన్నారు. మీలాగా కోదండరాం, హరగోపాల్ గొంతులు నొక్కడం లేదు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నామన్నారు.

మీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడ్డాయో అందరికీ తెలుసు. మా పాలనలో ఒకటవ తేది జీతం వేస్తున్నామని అన్నారు. జాబ్ క్యాలెండర్ హామీనీ నెరవేర్చుతామన్నారు. వాళ్ళు స్కూల్ బంద్ చేశారు.. మేము పేద ప్రజల కోసం స్కూల్ లు తెరిపిస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చారించారు. ఇక్కడ పేపర్ లీకేజి చూసి.. అక్కడ పెద్దలు నీట్ పేపర్ లీకేజీ చేశారన్నారు. తప్పుడు స్టేట్ మెంట్ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పు దోవ పట్టించ కూడదు హరీష్ రావు గారు.. సమస్యలు ఉంటే నాతో చెప్పండి.. సీఎం దగ్గరికి నేను తీసుకువెళతాను.. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని సూచ‌న చేశారు.

Next Story