జనగామ సెట్ చేశారుగా..!

హైదరాబాద్ మినిస్టర్ క్వార్ట‌ర్స్‌ క్లబ్ హౌస్ లో జనగామ టికెట్ విషయమై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

By Medi Samrat  Published on  10 Oct 2023 3:49 PM IST
జనగామ సెట్ చేశారుగా..!

హైదరాబాద్ మినిస్టర్ క్వార్ట‌ర్స్‌ క్లబ్ హౌస్ లో జనగామ టికెట్ విషయమై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గ నాయకులతో సమావేశమ‌య్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ జెండా కేసీఆర్ ఎత్తిన రోజు నుండి నేటి వరకు ముందున్న ఉన్న వ్యక్తి ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి అని అన్నారు. పార్టీ ఎక్కడ పని చేయమని ఆదేశిస్తే అక్కడ పనిచేశార‌ని.. ముత్తిరెడ్డి రాజకీయ జీవితంలో ఇది కామా మాత్రమే పుల్ స్టాప్ కాదని అన్నారు. గతం గతః అన్నట్టు పని చేసుకో పోవాలని సూచించారు.

రేపటి పంచాయతీ ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు కలిసి నిర్ణయాలు తీసుకోవాల‌న్నారు. రాజకీయంలో ఒక పదవిని, ఒక పొజీషన్ వదులుకోవాలంటే అంత ఈజీ కాదన్నారు. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటూ.. పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కలసి పని చేద్దామని, సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేద్దామని ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి హూందాతనాన్ని చాటారు. ఎక్కడ పల్లా, ముత్తిరెడ్డి విచ్చుకుపోతారా.. జనగామలో బీఆర్ఎస్ ను ఓడ‌గొడదామా అని రాష్ట్రంలో కొన్ని నక్కలు, తోడేళ్ళు ఎదురు చూస్తున్నాయన్నారు. వాటికి చెక్ పెట్టాలంటే చాలా పటిష్టంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల కోసం ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి విస్తృతం చేయాలన్నారు.

Next Story