Video: కేటీఆర్, హరీష్‌రావును కలిసి కాంగ్రెస్ బహిష్కృత నేత..ఎందుకో తెలుసా?

కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో అసెంబ్లీలోని సీఎల్పీలో కలిశారు.

By Knakam Karthik
Published on : 17 March 2025 12:54 PM IST

Telangana, Assembly Sessions, Mlc Mallanna, Ktr, Harisharao, Cm Revanthreddy

Video: కేటీఆర్, హరీష్‌రావును కలిసి కాంగ్రెస్ బహిష్కృత నేత..ఎందుకు తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో అసెంబ్లీలోని సీఎల్పీలో కలిశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ని నిలదీయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్లన్న కేటీఆర్‌ను కోరారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముందు మల్లన్న.. ఓ వర్గం నేతలపై తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా.. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కేటీఆర్, హరీష్‌ రావులను కలిసిన తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా జేఏసీ నాయకులతో కలిసి కేటీఆర్, ఎంఐఎం అక్బరుద్దీన్, బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డిని కలిశాం. అన్ని పార్టీల నేతలు బీసీ బిల్లుకు మద్దతు తెలిపుతామని ప్రకటించారు. బీసీల పట్ల ఆయా పార్టీలు ప్రేమను చాటుకోవాలని కోరాం. అన్ని పార్టీల మద్దతుతో ఈ బిల్లు ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు 42 శాతం బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీలను కోరుతున్నాం..అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు.

Next Story