ఏపీలో జగన్ ప్రజలకు అండగా నిలబడ్డారు.. తెలంగాణ‌ ప్ర‌తిప‌క్ష నేత ఎక్క‌డ‌.? : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అయ్యిందని.. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్ర‌శ్నించారు

By Medi Samrat  Published on  3 Sep 2024 10:11 AM GMT
ఏపీలో జగన్ ప్రజలకు అండగా నిలబడ్డారు.. తెలంగాణ‌ ప్ర‌తిప‌క్ష నేత ఎక్క‌డ‌.? : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అయ్యిందని.. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్ర‌శ్నించారు. ప్రజలకు భరోసా ఇస్తూ.. సర్కారుకు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండే.. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని.. రాజకీయాలను పక్కన పెట్టి సాయం చెయ్యాల్సిన సోయి లేదా అని విమ‌ర్శించారు. కేసీఆర్ ఏ ఫామ్ హౌస్ లో పడకున్నాడో ప్రజలు తెలుసుకునే పనిలో ఉన్నారని అన్నారు.

మొన్నటి వరకూ కవిత బెయిల్ కోసం పనిచేశారు. ఇప్పుడు తండ్రి ఫామ్ హౌస్‌లో ఉంటే.. కేటీఆర్ ఇంగ్లాండ్ లో రిలాక్స్ అవుతున్నడు. ఇంగ్లాండ్ లో విహార యాత్రలో ఉండి సోషల్ మీడియా లో ట్వీట్ చేస్తున్నారు. సోషల్ రెస్పాన్సబులిటీ మరిచి సోషల్ ట్వీట్ లు పెడుతున్నారని విమ‌ర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులను ఆదుకోడానికి రోడ్డు మార్గంలో వెళ్లి పర్యటిస్తునలు చేస్తున్నార‌ని ప‌రిస్థితిని వివ‌రించారు.

నాలుగు రోజులుగా సీఎం, మంత్రలు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. కేటీఆర్‌కు హెలికాప్ట‌ర్ల‌ సోకులు తప్ప మరేం లేవ‌ని.. పసలేని ట్వీట్లు పెడ్తూ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వరద సాయం చేస్తానని చెప్పి అన్ని ఎగొట్టాడని విమర్శించారు.

ప్రధాన మంత్రి ఫసల్ భీమా కట్టకుండా రైతులను మోసం చేసిన మొనగాడు కేసీఆర్ అని వి మ‌ర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాజ్ భవన్ ముందున్న ఎంఎస్ ముక్తా నీటమునిగిన కేసీఆర్ గడపదాటి బయటికి రాలేదన్నారు. కేంద్రంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆర్ధిక సాయం కోరారని.. కొన్ని పేపర్లో అడ్డగోలుగా వార్తలు రాస్తున్నారు. వాస్తవాలకు దూరంగా వార్తలు వస్తున్నాయన్నారు.

ఏపీ లో ప్రతిపక్ష నేతగా జగన్‌ సమర్దవంతమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. బాధ్యత గ‌ల ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకు అండగా నిలబడ్డారని అన్నారు. ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని అన్నారు. ఇంత విపత్తు వచ్చిన కేసీఆర్, కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్ర‌శ్నించారు. సంపాదించుకున్న సొమ్ముని దాచుకునే పనిలో బీఆర్ఎస్‌ నేతలున్నారని ఆరోపించారు. సర్కార్ కు సపోర్ట్ చేయాలని సూచించారు. సిటీ ఆఫ్ లేక్స్ అంటేనే హైదరాబాద్ అని.. హైడ్రాకు మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నామ‌న్నారు.

Next Story