నాది ఆస్తుల పంచాయితీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ: కవిత

సోమవారం ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు.

By -  Knakam Karthik
Published on : 5 Jan 2026 1:43 PM IST

Telangana, Mlc Kavitha, Brs, Congress, Telangana Assembly Sessions

నాది ఆస్తుల పంచాయితీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ: కవిత

తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తనపై 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీలో రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనట్లు చెప్పారు. అంతర్గత వేదికల్లో తాను ప్రశ్నిస్తే కెసిఆర్ చుట్టూ ఉన్నవారు వేధించారని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది..అని కవిత ప్రశ్నించారు. తాను ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటికి పంపారు..అని కవిత వ్యాఖ్యానించారు.

అటు ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కూడా అక్రమాలు జరిగాయి. కెసిఆర్ దగ్గర మాట్లాడే వేరే నాకు ఉంది కాబట్టే ఎప్పటికప్పుడు విషయాలు కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చాను. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మార్చడానికి నేను వ్యతిరేకించాను..అని కవిత మండలిలో మాట్లాడారు.

ఒక లక్ష 89 వేల కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. బీజేపీ తెలంగాణకు ఒక ప్రాజెక్టు ఇవ్వలేదు విభజన హామీలు అమలు చేయలేదు. కెసిఆర్ మీద కోపంతో నన్ను జైల్లో పెట్టారు. న్ను జైల్లో పెట్టినా నేను ఒక్కదాన్నే పోరాటాలు చేశాను పార్టీ నాకు అండగా నిలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ పై విమర్శలు చేస్తే నేను వ్యతిరేకించాను, పార్టీ నేతలు ఎందుకు కేసీఆర్ విషయంలో మాట్లాడరు. కేటీఆర్, హరీష్ రావు పై విమర్శలు చేస్తే పార్టీ నేతలు అంతా మాట్లాడతారు. బీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం అనేది ఒక జోక్..అని కవిత విమర్శించారు. నైతికత లేని బిఆర్ఎస్ పార్టీ నుంచి దూరంగా ఉండటం మంచిదని భావించే బయటకి వచ్చినట్లు కవిత చెప్పారు.

బీఆర్ఎస్‌లో చీలికలను కాంగ్రెస్ తమ అస్త్రంగా మార్చుకోవాలని చూస్తుంది..అని కవిత ఆరోపించారు. ఇదే క్రమంలో తనకు బీఆర్ఎస్‌తో వైరంపై కవిత మాట్లాడుతూ..నాకు దైవభక్తి ఎక్కువ దేవుడిపై, నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవం పంచాయితీ..అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story