బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంపై కవిత బాంబ్ పేల్చారు. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారని కవిత ప్రశ్నించారు. హరీష్ రావు, సంతోష్ రావులు తన మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారని, మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారన్నారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద, డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారన్నారు కవిత. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలని సంచలన వ్యాఖ్యలు చేసారు కల్వకుంట్ల కవిత.