బీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదని కవిత విమర్శించారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కాగా తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కల్లో తాను గుర్తించడం లేదని కవిత పేర్కొన్నారు.
మరో వైపు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే.. బీఆర్ఎస్ వాళ్లు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారు, అది తప్పు బీఆర్ఎస్ వాళ్లు నా దారికి రావాల్సిందే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు మద్దతు ఇచ్చారు. నాలుగు రోజులు టైమ్ తీసుకుంటారేమో అంతే...అని కవిత వ్యాఖ్యానించారు.