ఆత్మీయంగా పలకరించుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత

Mlc Kavitha Kalvakuntla Bjp Mp Bandi Sanjay Kumar Conversation. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు ఏ మాత్రం పడడం లేదు.

By Medi Samrat
Published on : 31 May 2023 4:44 PM IST

ఆత్మీయంగా పలకరించుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు ఏ మాత్రం పడడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ ను.. ఆయన కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు ఏకి పారేస్తూ ఉంటారు. ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడంతో ఆమెను టార్గెట్ చేస్తూ ఎన్నో విమర్శలు చేశారు. పలు ప్రెస్ మీట్లు పెట్టి ఆమెపై పలు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు అన్నిటికీ కల్వకుంట్ల కవిత ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. రాజకీయ పరంగా బద్ధ శత్రువులైన వీళ్లు ఎదురెదురు పడితే ఏమి జరుగుతుందా అనే డౌట్ అందరికీ ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నిజామాబాద్‌లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటి గృహ ప్రవేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. అయితే ఒకేసారి ఇద్దరు నేతలు ఆ శుభకార్యానికి హాజరయ్యారు. ఇరువురు నేతలూ పరస్పరం తారసపడగా ఆత్మీయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురిని ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్‌ కుమార్‌కు పరిచయం చేశారు.


Next Story