త‌ప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు : కల్వకుంట్ల కవిత

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేణిగుంట ఎయిర్ పోర్టు వ‌ద్ద మాట్లాడారు.

By -  Medi Samrat
Published on : 5 March 2026 2:56 PM IST

త‌ప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు : కల్వకుంట్ల కవిత

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేణిగుంట ఎయిర్ పోర్టు వ‌ద్ద మాట్లాడారు. తప్పుడు కేసు పెట్టి నన్ను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారని.. కానీ సత్యం నా వైపు ఉండటం, దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందన్నారు. వేంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకం.. కాలి నడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉంది.. కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా మా కుటుంబం, జాగృతి కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకోవటానికి వచ్చామని పేర్కొన్నారు. ఆంధ్రాలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారు వారందరికీ కృతజ్ఞతలు.. త్వరలోనే మేము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానని ముగించారు.

Next Story